ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:39 PM
ఆహార నాణ్యతలో విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి వంటశాల గదులు, కూరగాయల నిల్వ వంట సామగ్రిని పరిశీలించారు.
దండేపల్లి, డిసెంబరు13(ఆంధ్రజ్యోతి): ఆహార నాణ్యతలో విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి వంటశాల గదులు, కూరగాయల నిల్వ వంట సామగ్రిని పరిశీలించారు.
భోజనం నాణ్యతగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సరుకులు, కూరగాయలు నాణ్యతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్ధులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని డీఈవో ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్ధుల ప్రతిభను ఆయన పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి, తర్వాగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.