Share News

సింగరేణి పరిరక్షణకు పోరాటాలు

ABN , Publish Date - Nov 09 , 2024 | 10:40 PM

తెలంగాణకే తలమానికమైన సింగరేణి పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శనివారం సీపీఎం పార్టీ మూడవ మహాసభల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

 సింగరేణి పరిరక్షణకు పోరాటాలు

మందమర్రిటౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకే తలమానికమైన సింగరేణి పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శనివారం సీపీఎం పార్టీ మూడవ మహాసభల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఆదాని, అంబానీలకు బొగ్గు బ్లాకులను కట్ట బెట్టేందుకు చూస్తుందన్నారు. ఇప్పటికే లాభాల్లో ఉన్న అనేక పరిశ్రమలను ఆదానికి కట్టబెట్టారన్నారు. సింగరేణిలో రానున్న రోజుల్లో భూగర్భ గనులు మూత పడనున్నాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నూతన గనులను ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటా యించాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిం చాలన్నారు. హైపవర్‌ కమిటీ వేతనాలను అమలు చేయాలన్నారు. సీపీఎం నాయకులు పాలడుగు భాస్కర్‌, సంకె రవి, పైళ్ల ఆశయ్య పాల్గొన్నారు.

జిల్లా కమిటీ ఎన్నిక : సీపీఎం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. జిల్లా కార్యదర్శిగా సంకె రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా గోమాస ప్రకాష్‌, కనికరపు అశోక్‌, ఎర్మ పున్నం, జిల్లా కమటీ సభ్యులుగా బోడెంకి చందు, గుమాస అశోక్‌, దాగం రాజారాం, రంజిత్‌కుమార్‌, శ్రీనివాస్‌, శ్యామల, ఉమారాణి, ప్రేమ్‌కుమార్‌, లింగన్నలను ఎన్నుకున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 10:40 PM