Share News

చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:09 PM

చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు కోర్టు జడ్జి రవి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు.

చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

జైపూర్‌, సెప్టెంబరు 29: చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు కోర్టు జడ్జి రవి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలు చేయడానికి భయపడతారని సూచిం చారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకుంటే మంచి స్ధాయికి చేరుకుంటారని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా సత్ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుని ఇతరులకు అవగాహన కల్పించా లన్నారు. సీనియర్‌ న్యాయవాది కమల్‌ మనోహర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌, న్యాయవాది శ్రీనివాస్‌, ఎస్‌ఐ శ్రీధర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 10:09 PM