విద్యార్థులు సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 10:19 PM
విద్యార్థులు సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని నస్పూర్ ఎంఈఓ దామోదర్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టెస్ట్‌కు హాజరయ్యారు.
శ్రీరాంపూర్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని నస్పూర్ ఎంఈఓ దామోదర్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టెస్ట్‌కు హాజరయ్యారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్నతో కలిసి ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ, మొదటి స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని అన్నారు. ట్రస్మా మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, కోశాధికారి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అమన్ ప్రసాద్, కరస్పాండెంట్లు తిరుపతి, జస్టిన్, ప్రిన్సిపాల్ రజిని, తదితరులు పాల్గొన్నారు.