విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Nov 30 , 2024 | 10:47 PM
విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గౌతమినగర్ ట్రినిటీ హైస్కూల్‌లో నిర్వ హించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి హాజరయ్యారు.
గర్మిళ్ల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గౌతమినగర్ ట్రినిటీ హైస్కూల్‌లో నిర్వ హించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వైజ్ఞానిక ప్రదర్శనల్లో రాణిం చాలని, భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.
అనంతరం విద్యార్థులు ఆవిష్కరించిన పలు ఆవిష్కరణలను ఆయన పరిశీలించారు. వాటి పనితీరు, ఉపయోగాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంచి ర్యాల మున్సిపల్‌వైస్ చైర్మన్ సల్ల మహేష్, డీఈవో యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.