Share News

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:43 PM

మండలంలోని రేపల్లెవాడలోని శ్రీరామ జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తాండూర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రేపల్లెవాడలోని శ్రీరామ జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే పత్తిలో 12 శాతం తేమ తక్కువగా ఉండేలా చూసుకోవాలని, చెత్తచెదారం లేని నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారులకు పత్తి విక్రయించి మోసపోవద్దన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు.

రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. క్వింటాల్‌ పత్తి ధర రూ.7521 ఉందన్నారు. 12 శాతం కన్నా ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేయరని, 8 నుంచి 12 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి షాబుద్దీన్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇద్దరు యువ పత్తి రైతులు ప్రసాద్‌, రాములును సన్మానించారు. కార్యదర్శి భాస్కర్‌, డీవో రాజశేఖర్‌, తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏసీపీ రవికుమార్‌, సీఐ కుమారస్వామి, ఎస్‌ఐలు సౌజన్య, కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు గట్టు మురళీధర్‌రావు, రవీందర్‌రెడ్డి, ఎండీ ఈసా, సిరంగి శంకర్‌, సాలిగాం బానయ్య, పోచం, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:43 PM