ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Aug 29 , 2024 | 10:22 PM
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. గురువారం క్యాతనపల్లి, కల్మలపేట, ముల్కలపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. క్యాతనపల్లి పాఠశాల ఉపా ధ్యాయులు సునీల్‌కుమార్ సమయానికి హాజరు కాకపోవ డంతో డీఈవో సస్పెండ్ చేశారు.
వేమనపల్లి, ఆగస్టు 29: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. గురువారం క్యాతనపల్లి, కల్మలపేట, ముల్కలపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. క్యాతనపల్లి పాఠశాల ఉపా ధ్యాయులు సునీల్‌కుమార్ సమయానికి హాజరు కాకపోవ డంతో డీఈవో సస్పెండ్ చేశారు. అలాగే పాఠశాలలకు ఆల స్యంగా హాజరైన క్యాతనపల్లి ఉపాధ్యాయురాలు శ్యామల, ముల్కలపేట ఉపాధ్యాయురాలు కవితలకు షోకాజ్ నోటీ సులు అందజేశారు. పాఠశాలల్లోని రికార్డులను, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమ యపాలన పాటించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. పాఠశాలకు రాకున్నా రిజిష్టర్‌లలో సం తకాలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. సెక్టోరల్ అధి కారిచౌదరి, కాంప్లెక్స్ హెచ్‌ఎంగిరిధర్‌రెడ్డి, సీఆర్‌పీలు ఉన్నారు.
కోటపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని డీఈవో యాదయ్య ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం పాత సూపాక, కొత్త సూపాక, వెంచపల్లి ప్రాథ మిక పాఠశాలలతోపాటు పారుపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యా ర్థుల నైపుణ్యాలను తెలుసుకున్నారు. పదో తరగతి విద్యా ర్థులతో ఆయన మాట్లాడుతూ పరీక్షలంటే భయపడవద్దని ప్రతి సబ్జెక్టును అర్ధం చేసుకోవాలని, సులభంగా ఉన్న అధ్యాయాలను నేర్చుకోవాలన్నారు. సెక్టోరియల్ అధికారి చౌదరి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఉన్నారు.