Share News

ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అవాస్తవం

ABN , Publish Date - Sep 24 , 2024 | 10:46 PM

ఎన్నికల సమయంలో తనను చంపేందుకు సుపారీ ఇచ్చి మనుషులను తెప్పించారని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారంటూ ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయ న నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిం చారు.

ఎమ్మెల్యే  చేసిన ఆరోపణలు అవాస్తవం

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబర్‌ 24: ఎన్నికల సమయంలో తనను చంపేందుకు సుపారీ ఇచ్చి మనుషులను తెప్పించారని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారంటూ ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయ న నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిం చారు. దివాకర్‌రావు మాట్లాడుతూ అవినీతి అక్రమా లకు, భూకబ్జాలకు పాల్పడే ప్రేంసాగర్‌రావు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, కబ్జాకోరు ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్నికల సమ యంలో హైదబాద్‌లోని కప్రాకు చెందిన ప్రేంసాగర్‌ రావు బాధితులు ఆందోళనకు దిగిన విషయం వాస్త వం కాదా అని ప్రశ్నించారు. డీకొండ అన్నయ్యకు నోటీసు జారీ చేయకుండానే భవనాన్ని కూల్చారని అన్నారు. భూకబ్జాలపై మాట్లాడే ఎమ్మెల్యే 324 సర్వేనెంబర్‌లోని 57 ఎకరాల భూమిని రికవరీ చేయాలని సవాలు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను కూల్చి అక్కడ ఆసుపత్రి కడుతామని ఎమ్మెల్యే చెప్తు న్నారని, నిర్మాణాలు చేపట్టడం వదిలేసి కూల్చడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గంజాయి సంస్కృతిని పెంచి పోషిస్తున్నది ఎవరో అందరికి తెలుసన్నారు. తమ వర్గానికి చెందిన నాయకులపై తప్పుడు కేసు లు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమ పై కూడా తప్పుడు కేసులు పెట్టించేందుకు యత్ని స్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరై న సమయంలో గుణపాఠం చెప్తారన్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదే సత్యం, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అంకం నరేష్‌, నాయకులు విజిత్‌రావు, పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 10:46 PM