వ్యాపారులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 03 , 2024 | 10:51 PM
మంచిర్యాల మార్కెట్ వ్యాపారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాల పేరుమీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు రఘునాధ్ వెరబెల్లి అన్నారు. గురువారం వ్యాపార సముదాయాలను సందర్శించారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 3: మంచిర్యాల మార్కెట్ వ్యాపారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాల పేరుమీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు రఘునాధ్ వెరబెల్లి అన్నారు. గురువారం వ్యాపార సముదాయాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాత్రికి రాత్రి మార్కింగ్‌లు చేసి సమాచారం ఇవ్వకుండా వ్యాపార సముదాయాలను కూల్చడం వారిని ఆర్థికంగా దెబ్బతీయడమేనన్నారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా వ్యాపారం జరుగుతుందని, ఈ సమయంలో వ్యాపార సముదాయాలను కూల్చి వారి పొట్టకొట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వా నికి చిత్తశుద్ధి ఉంటే వ్యాపారులను పిలిపించి ఎక్కడెక్కడ అక్రమ కట్టడా లున్నాయో వాటిని ఒక పద్ధతి ప్రకారం కూల్చాల్సింది పోయి కక్ష సాధిం పు చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామన్నారు. పండగల సందర్భంగా కూల్చివేతలు ఆపాలని కోరారు. బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, జిల్లా అధికార ప్రతినిధి రాకేష్, నాయకులు రమేష్, అశ్విన్, శ్రీదేవి, రాకేష్ రేన్వా, చక్రవర్తి, జయారం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నస్పూర్, అక్టోబరు 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సుందరయ్య కాలనీలో గురువారం సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. రఘునాథ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సభ్య త్వ నమోదుకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఒకటవ వార్డు ఇన్చార్జీ రవనవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నవేని సదయ్య, నాయకులు వెంకటస్వామి, అనూష, తిరుపతి, సదానందం, మహేష్, కార్తీక్, చెల్ల విక్రమ్, పులి రాజేందర్ గౌడ్, చక్రి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరికలు
వేమనపల్లి, అక్టోబరు 3: వేమనపల్లికి చెందిన కంపెల అజయ్‌కుమా ర్, కొండ రవిలు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్ సమక్ష్యంలో బీజేపీలో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానిం చారు. వెంకటకృష్ణ, సంతోష్‌కుమార్, శ్రీకాంత్, స్వామి పాల్గొన్నారు.