సర్వేలో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:38 PM
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌లతో కలిసి మంచిర్యాలలోని 5, 27వ వార్డుల్లో పరిశీలించారు.
మంచిర్యాల అర్బన్, నవంబర్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌లతో కలిసి మంచిర్యాలలోని 5, 27వ వార్డుల్లో పరిశీలించారు. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ఇండ్ల జాబితా పూర్తయిందని, ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లలో పూర్తి స్థాయిలో కుటుంబ వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారో సంబంధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించాలని, ఇంటి యజమానులు అవసరమైన పత్రాలతో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జైపూర్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారి (స్టేట్ ఆఫీసర్) కృష్ణఆదిత్య పేర్కొన్నారు. సోమవారం శెట్‌పల్లిలో చేపడుతున్న సర్వేను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సర్వే తీరును పరిశీలించారు. సర్వే ఫారాలను తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్ రోజు 25 ఇండ్లు సర్వే చేయాలని, సర్వేలో తప్పులు లేకుండా నమోదు చేయాలని, కుటుంబ యజమానితో అన్ని వివరాలు తెలుసుకుని నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్‌డీవో కిషన్, ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ వనజారెడ్డి, ఏపీఎం రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, (ఆంధ్రజ్యోతి) : దేవాపూర్, పల్లంగూడ, పెద్దనపల్లి, కోమటిచేను, బుగ్గగూడ, మల్కేపల్లి, గట్రావుపల్లిలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సోమవారం ఎంపీడీవో సత్యనారాయణసింగ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 9919 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 2093 కుటుంబాలను సర్వే చేశామని తెలిపారు. ఎంపీవో సప్దర్ ఆలీ, సూపరింటెండెంట్ లక్ష్మయ్య, సీనియర్ సహాయకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): కిష్టంపేట గ్రామంలోని దబ్బేటిగూడెంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సోమవారం డీపీవో, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు పరిశీలించారు. ప్రతీ ఇంటిని సర్వే చేసి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజలందరు సర్వేకు సహకరించాలన్నారు. ఎంపీవో అజ్మత్ ఆలీ, పంచాయతీ కార్యదర్శి మదుకర్ ఉన్నారు.