కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సింగరేణికి భవిష్యత్తు
ABN , Publish Date - Oct 06 , 2024 | 10:10 PM
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి, కాంట్రాక్టు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సు శ్రీరాంపూర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణి కార్మికులకు మెరుగైన లాభాల వాటా ఇప్పించామన్నారు.
శ్రీరాంపూర్, అక్టోబరు 6: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి, కాంట్రాక్టు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సు శ్రీరాంపూర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణి కార్మికులకు మెరుగైన లాభాల వాటా ఇప్పించామన్నారు. అందులో భాగంగా కాం ట్రాక్టు కార్మికులకు సైతం రూ.5 వేలు అందించేం దుకు కృషి చేశామన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. రిటైర్డ్ కార్మికులకు సైతం తెల్లరేషన్ కార్డులు ఇప్పి స్తామని, అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తా మన్నారు. సింగరేణిలో ప్రభుత్వ జోక్యం పెరిగిందని కొన్ని యూనియన్లు ఆరోపణలు గుప్పిస్తున్నాయని, కానీ ప్రభుత్వ సహకారం లేనిదే ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి మనుగడ సాగించలేదన్నారు. ఈ విషయంపై అవగాహన లేని యూనియన్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. కార్మి కుల సంక్షేమం దృష్ట్యా తాము సంస్థను ఎల్లవేళలా కాపాడుతామని హామీ ఇచ్చారు. ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, కనీస వేతనాల బోర్డు చైర్మన్, జేబీసీసీఐ సభ్యుడు బి.జనక్‌ప్రసాద్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. యూనియన్, ప్రభుత్వం కార్మికులకు చేస్తున్న సేవలను తెలిపారు. ఏరియా ఉపాధ్యక్షుడు జె. శంకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనియన్‌కు చెందిన సీనియర్ నాయకులు, ఏరియా నాయకులు ధర్మపురి, నర్సిం హారెడ్డి, గరిగె స్వామి, భీంరావు పాల్గొన్నారు.