Share News

వైద్య వృత్తి ఎంతో విలువైంది

ABN , Publish Date - Nov 04 , 2024 | 10:48 PM

ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తి ఎంతో విలువైందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ప్రిన్సిపాల్‌ దావూద్‌ సులేమాన్‌తో కలిసి హాజర య్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3వ బ్యాచ్‌ కొనసాగుతుందని, వైద్య విద్యార్థులు ఏకా గ్రతతో చదువుకుని ఉన్నత స్ధానానికి చేరుకోవాలన్నారు.

వైద్య వృత్తి ఎంతో విలువైంది

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తి ఎంతో విలువైందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ప్రిన్సిపాల్‌ దావూద్‌ సులేమాన్‌తో కలిసి హాజర య్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3వ బ్యాచ్‌ కొనసాగుతుందని, వైద్య విద్యార్థులు ఏకా గ్రతతో చదువుకుని ఉన్నత స్ధానానికి చేరుకోవాలన్నారు. కళాశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత మెడికల్‌ సైన్స్‌ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకుని వైద్యులుగా బయ టకు వెళ్తారని, ప్రాక్తీస్‌ చేసి ప్రజలకు వైద్య సేవలందించి వారి జీవితాలను కాపాడుతారన్నారు. ప్రభుత్వ వైద్య కళా శాలలో అన్ని సౌకర్యాలతో తరగతులు నిర్వహిస్తున్నామ న్నారు. వైద్య విద్యలో విద్యార్థులకు ఒత్తిడి ఉంటుందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలతో స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించారు. అధికారులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిబంధనలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలి

జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, జిల్లా వ్యవసాయాధికారి కల్పనతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జీవో నెంబరు 27 ప్రకారం 33 రకాల ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్‌ వర్తిస్తుం దని, సన్నరకం, దొడ్డు రకం వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

జిల్లాలో పత్తి కొనుగోలుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.7521 నిర్ణయించామన్నారు. సహకార అధికారి సంజీవరెడ్డి, మార్కెటింగ్‌ అధికారి షాబొద్దీన్‌, పౌరసరఫ రాల మేనేజర్‌ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 10:48 PM