పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి
ABN , Publish Date - Oct 07 , 2024 | 10:45 PM
రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానం వెంటనే అమలు చేయాలని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అన్నారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జన్నారం, అక్టోబరు 7: రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానం వెంటనే అమలు చేయాలని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అన్నారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ స్ధానంలో పాత పింఛన్ పునరుద్దరణ ప్రకటనకు అనుకూలంగా జీవోను జారీ చేయాలని పేర్కొన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్ధాన్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాత పింఛన్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా పాత పింఛన్ వర్తింపజేస్తూ జీవో జారీ చేయాలని కోరారు. ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. నాయకులు ప్రకాష్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.