Share News

కార్పొరేట్‌లకు ఊడిగం చేస్తున్న ప్రధాని

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:27 PM

ప్రధాని మోదీ కార్పొరేట్లకు ఊడి గం చేస్తున్నాడని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు పేర్కొ న్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ళుగా ప్రధాని మోదీ కార్పొరేట్‌లకు అనుకూలంగా పనిచేశాడని, కార్మికులను, ప్రజలను పట్టించుకోలేదన్నారు.

కార్పొరేట్‌లకు ఊడిగం చేస్తున్న ప్రధాని

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 8: ప్రధాని మోదీ కార్పొరేట్లకు ఊడి గం చేస్తున్నాడని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు పేర్కొ న్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ళుగా ప్రధాని మోదీ కార్పొరేట్‌లకు అనుకూలంగా పనిచేశాడని, కార్మికులను, ప్రజలను పట్టించుకోలేదన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా చేసి కార్మికులకు అన్యాయం చేశారన్నారు. సింగరేణి కార్మికు లకు లాభాల వాటా 35 శాతం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని చెల్లించాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను పర్మినెంటు చేయాలని, అంత వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాల న్నారు. ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జిల్లా కారన్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నాయకులు మేకల దాసు, పౌలు, కలీందర్‌ఆలీఖాన్‌, సరస్వతి, మల్లేష్‌,వీరభద్రయ్య, సత్యనారాయణ, బాపు, రాజన్న, రాయమల్లు,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 10:27 PM