Share News

ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 06 , 2024 | 10:13 PM

ప్రభుత్వం ఎరుకల సమ స్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర సలహాదా రులు శ్రీరాములు, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీని వాస్‌, లోకిని రాజు, రేవెల్లి రాజలింగు, రమేష్‌లు పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరులో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరించాలి

చెన్నూరు, అక్టోబరు 6: ప్రభుత్వం ఎరుకల సమ స్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర సలహాదా రులు శ్రీరాములు, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీని వాస్‌, లోకిని రాజు, రేవెల్లి రాజలింగు, రమేష్‌లు పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరులో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎరుకల కులస్తులు అధికంగా ఉన్నా రని, వీరు విద్య, ఉపాధి, ఆర్ధిక, రాజకీయంగా వెనక బడి ఉన్నారని తెలిపారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్‌మెంట్‌ స్కీం కింద పందులను పెం చుకోవడానికి ప్రభుత్వ స్థలా లను కేటాయించాలని కోరా రు. ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలన్నారు. చెన్నూరు నియోజకవర్గం లో ఏకలవ్య కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సమ్మయ్య, సుభాష్‌, రాము, రవి, పోశం, సారయ్య, సమ్మయ్య, సాయిలు, పోచం, రమేష్‌, పోశం, పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 10:13 PM