Share News

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:43 PM

దివ్యాంగుల హక్కుల సాధన కోసం శనివారం కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్‌ కమిటీ కో చైర్మన్‌ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ లో ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

నస్పూర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల హక్కుల సాధన కోసం శనివారం కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్‌ కమిటీ కో చైర్మన్‌ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ లో ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించాలన్నారు. 2016 చట్టాన్ని అమలు చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులను నిర్మించాలన్నారు.

బ్యాక్‌ లాక్‌ ఉద్యోగులను భర్తీ, బ్యాంకుల ద్వారా ఉపాధి రుణాలు ఇప్పించాలన్నారు. పెన్షన్లను పెంచాలని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధనకు ఈ నెల 26న చలో హైదరాబాద్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీక్షకు ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ళ మల్లేష్‌ మాదిగ మద్దతు ప్రకటించారు. నాయకులు బివి అప్పారావు, రాచర్ల రాజయ్య, ముల్కల్ల రాజజేంద్ర ప్రసాద్‌, ఇందూరి రమేష్‌, బండోజు నగేష్‌, మామిడి రాజశేఖర్‌, ఇప్ప రేష్‌, ప్రకాష్‌, సురేష్‌, షేక్‌ రావ్‌ మల్లేష్‌, గోపాల్‌, రామ్‌ శ్రీనివాస్‌, లింగమూర్తి, సుశీల అఖిల పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 10:43 PM