Share News

సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:39 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, రాజకీయ, విద్య, కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి కల్పన పేర్కొన్నారు. ఆదివారం బీసీ కాలనీలో జిల్లా పంచాయతీ అధికారి, ముదిరాజ్‌ కాలనీలో జరుగుతున్న సర్వేను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు.

సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

భీమారం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, రాజకీయ, విద్య, కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి కల్పన పేర్కొన్నారు. ఆదివారం బీసీ కాలనీలో జిల్లా పంచాయతీ అధికారి, ముదిరాజ్‌ కాలనీలో జరుగుతున్న సర్వేను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు. ఎన్యుమరేటర్లకు సూచనలు చేశారు. సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. స్టిక్కర్లను ప్రతీ ఇంటికి అతికించాలన్నారు. ఎంపీడీవో మధుసూదన్‌, మండల పంచాయతీ అధికారి సతీష్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

కోటపల్లి, (ఆంధ్రజ్యోతి): ఇంటి యాజమాని గుర్తింపు సర్వేను ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేకాధికారి పురుషోత్తంనాయక్‌ అన్నారు. కొల్లూరులో ఇంటి యజమాని గుర్తింపు సర్వేను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌తో పాటు ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

బెల్లంపల్లిరూరల్‌, (ఆంధ్రజ్యోతి) : కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో హరికృష్ణ అన్నారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల సామాజిక ఆర్థిక, ఆదాయ, రాజకీయ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం కుల గణన నిర్వహిస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కమిషనర్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సబ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 10:39 PM