సమగ్ర సర్వేలో సందేహాలెన్నో...!
ABN , Publish Date - Nov 17 , 2024 | 10:28 PM
రాష్ట్ర ప్రభు త్వం ఇంటింటి కుటుంబ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తర గతులు, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతికి సర్వే తోడ్ప డుతుందని పేర్కొంది. సేకరిస్తున్న సమాచారం గోప్యం గా ఉంటుందని, ప్రజలు నిర్భయంగా తమ స్థితిగతుల వివరాలను ఎన్యూమరేటర్లకు చెప్పాలని సూచించింది. అయినా ప్రజల్లో సందేహాలు వీడటం లేదు.
మంచిర్యాల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ఇంటింటి కుటుంబ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తర గతులు, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతికి సర్వే తోడ్ప డుతుందని పేర్కొంది. సేకరిస్తున్న సమాచారం గోప్యం గా ఉంటుందని, ప్రజలు నిర్భయంగా తమ స్థితిగతుల వివరాలను ఎన్యూమరేటర్లకు చెప్పాలని సూచించింది. అయినా ప్రజల్లో సందేహాలు వీడటం లేదు. ఫలితంగా సర్వేలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేకు వెళ్లిన అధికారులతో ప్రజలు తమ సందేహాలు, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కొందరు వివ రాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా సంపన్న కుటుంబాల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. దీంతో సర్వే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
ఉపాధ్యాయులకు తప్పని పాట్లు
ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, మున్సిపాలిటీ సిబ్బందిని నియమించారు. ఈనెల 9వ తేదీ నుంచి సర్వే ప్రారంభం కాగా సర్వే ఫారాలు సకాలంలో అందక కొన్ని చోట్ల ఒక రోజు ఆలస్యంగా మొదలైంది. కుటుంబ సర్వే విధులు నిర్వ హిస్తున్న ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలకు వెళ్లి, మధ్యాహ్నం తర్వాత ఇంటింటి సర్వేకు వెళుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్లలో చాలామంది అందు బాటులో ఉండకపోవడంతో వివరాల సేకరణకు ఆటం కాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈనెల 18వ తేదీలోపు గణన పూర్తి చేయాలన్న ఆదేశాలతో చేసేది లేక వారు ఉదయం 6 గంటలకే సర్వేకు వెళ్లి 8 గంటలకు స్కూళ్లకు వెళుతున్నారు. మధ్యాహ్నం స్కూలు అయిపో గానే మళ్లీ సర్వే చేపడుతున్నారు. కొందరు ఉపాధ్యాయు లైతే రాత్రి 8 గంటల వరకు సర్వే చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్లు(ఎస్‌జీటీల)కు ఎన్యూమరేటర్ల విధులు ఇచ్చి కాంట్రాక్టు సీఆర్‌పీలను సూపర్‌వైజర్లుగా నియమించడంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవు తోంది. పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు (పీటీఐ)లను ఎన్యూమరే టర్లుగా నియమించగా వీరిలో చాలా మంది తమ పలు కుబడిని ఉపయోగించి విధుల్లో నుంచి మినహాయింపు పొందడంతో ఆ భారం కూడా టీచర్లపైనే పడుతోంది.
అనేక ప్రశ్నలతో ఇబ్బందులు
సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు అడగాల్సి రావడంతో ఇంటి యజమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైగా ఇన్ని ప్రశ్నలా? ఇవన్నీ అవసరమా? అని సర్వే సిబ్బం దిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే వివరాలు చెప్పడానికి విసుక్కుంటున్నారు. దీంతో ఒక్కో ఇంటిని సర్వే చేయడానికి ఎన్యూమరేటర్‌కు గరిష్ఠంగా 30 నిమిషాలకన్నా ఎక్కువగానే పడుతోంది. గ్రామీణ ప్రాం తాల్లో పలు ప్రశ్నలకు ప్రజల వద్ద సమాచారం లేకపోవ డంతో వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురవుతోంది. సర్వే ఫారంలో పేర్కొన్న ప్రకారం కోళ్లు, గొర్రెలు, పశువులు తదితర వివరాలు ఎందుకంటూ నిలదీస్తున్నారు.
ఏరోజు కారోజు అందజేత
పూర్తి చేసిన సర్వే పారాలను ఏ రోజుకారోజు ఎంపీ డీవో కార్యాలయాల్లో సూపర్‌వైజర్లకు అప్పగిస్తున్నారు. అయితే ఎన్యూమరేటర్లు వెళ్లే సరికి సూపర్‌వైజర్లలో కొందరు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు వచ్చేదాక వేచి ఉండాల్సి వస్తుం దని సమాచారం. కంప్యూటరైజ్ ప్రక్రియ ఇప్పటి వరకు ఎక్కడా ప్రారంభం కాలేదని తెలుస్తోంది.
అసమగ్రంగా సర్వే ప్రక్రియ....
సర్వేలో చాలా మంది పూర్తి వివరాలు ఇవ్వడానికి వెనుకాడుతుండటం, ఆస్తులు, ఆదాయం, భూములు, ఇతర వివరాలు ఇవ్వడం ద్వారా మున్ముందు సంక్షేమ పథకాల్లో కోత పడుతుందేమోననే అనుమానంతో గోప్యత పాటిస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాల కింద లబ్ధి పొందిన వివరాలను చెప్పకుండా దాచేస్తున్నారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఇతర పథకాల ద్వారా పొందిన సాయం విషయాన్ని దాచిపెడుతున్నారు. ఆధార్‌కార్డు వివరాలు తెలియజే యడం ఐచ్చికం అని చెప్పడంతో వాటిని కొందరు ఇస్తుం డగా.. మరికొందరు ఇవ్వడం లేదు. ఇంటింటి సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తున్నారు. సంప్రదాయ కులవృత్తి ద్వారానే ఉపాధి పొందుతున్న వారి వివరాలు నమోదుకు అవకాశం లేకుండాపోవడంతో ఆయా కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లను ఈ విషయమై నిలదీస్తున్నారు. సర్వే ఫారంలో కుల వృత్తి కాలం ఎందుకు లేదని, దానిపై ఆధారపడి బతుకుతున్న వారి ఆర్థిక, ఉపాధిని ప్రభుత్వం ఎలా లెక్కిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.