Share News

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదు

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:30 PM

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. మంగళవారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌లు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదు

మందమర్రిటౌన్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. మంగళవారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌లు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. సిబ్బంది వివరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాల పట్ల పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు మెసేజ్‌లను ఓపెన్‌ చేయవద్దన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ దరఖాస్తును పిటీషన్‌ మేనేజ్‌మెంట్‌లో నమోదు చేసి రశీదు ఇవ్వాలని సూచించారు. ప్రజలకు జవాబుదారిగా పనిచేయడమే పోలీసులు విఽధి అని గుర్తుంచుకోవాలన్నారు. రౌడీషీటర్లపై, ట్రబుల్‌ మ్యాంగర్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, సత్వర న్యాయం జరిగేలా వారికి భరోసా కల్పించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డయల్‌ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. సీపీ, డీసీపీలు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, రామకృష్ణపూర్‌, కాసిపేట, దేవాపూర్‌ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

నేరాల కట్టడికి పోలీసులు కృషి చేయాలి

బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి) : విధుల్లో అప్రమత్తంగా ఉంటూ నేరాల కట్టడికి పోలీసులు కృషి చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సీపీకి ఏసీపీ రవికుమార్‌ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి కేసుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల రికార్డులను పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. నేరం జరిగిన వెంటనే వేగంగా స్పందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు విజుబుల్‌ పోలీసింగ్‌, నిరంతర పెట్రోలింగ్‌, ఆకస్మిక వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలన్నారు. డీసీపీ భాస్కర్‌, టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవయ్య, రూరల్‌ సీఐ అప్జలుద్దీన్‌, తాండూర్‌, మందమర్రి సీఐలు కుమారస్వామి, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 10:30 PM