Share News

రేపటి ధర్నాను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Aug 31 , 2024 | 10:57 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా, నిత్యావసర ధరలను నియంత్రించా లని ఈ నెల 2న కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఖలిందర్‌ఆలీఖాన్‌ పేర్కొన్నారు.

రేపటి ధర్నాను విజయవంతం చేయాలి

జన్నారం, ఆగస్టు 31: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా, నిత్యావసర ధరలను నియంత్రించా లని ఈ నెల 2న కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఖలిందర్‌ఆలీఖాన్‌ పేర్కొన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ను నచ్చిన రాష్ట్రాలకు ఎక్కువ, వ్యతి రేకంగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ బడ్జెట్‌ కేటాయిస్తుందన్నారు.

రోజురోజు కు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. రైతులందరికి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రైతులు, ప్రజలు, నాయకులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. మండల కార్యదర్శి దాసరి తిరుపతి, నాయకులు పౌలు, మహేందర్‌రెడ్డి, విజయ్‌, రాజేశం పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 10:57 PM