న్యూ ఇయర్ వేడుకలో విషాదం
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:28 PM
నూతన సంవత్సర వేడుకల్లో విషా దం నెలకొంది. స్నేహితులతో కలిసి దావత్ చేసుకొని తిరి గి వస్తుండగా బైక్ అదుపు తప్పి కాల్వలో పడిన సంఘ టనలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన మంద రాజు (35), జిల్లాపెల్లి పవన్‌కళ్యాణ్(25) లు బైక్‌పై దండేపల్లి శివారులో అటవీ ప్రాంతంలో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు.
దండేపల్లి, డిసెంబరు 31(డిసెంబరు): నూతన సంవత్సర వేడుకల్లో విషా దం నెలకొంది. స్నేహితులతో కలిసి దావత్ చేసుకొని తిరి గి వస్తుండగా బైక్ అదుపు తప్పి కాల్వలో పడిన సంఘ టనలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన మంద రాజు (35), జిల్లాపెల్లి పవన్‌కళ్యాణ్(25) లు బైక్‌పై దండేపల్లి శివారులో అటవీ ప్రాంతంలో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు.
అనంతరం బైక్‌పై ఇంటికి వస్తుండగా కస్తూర్బా విద్యాలయం సమీపంలోని కడెం ప్రధాన కాలువ పక్కన గల 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువలో ప్రమాదశాత్తు బైక్‌తో సహా పడ్డారు. వారితో వస్తున్న మిగితా స్నేహతులు గమనించి కాలువలో వారిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలిం చారు. చికిత్స అందించేలోపు ఇద్దరు మృతి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. జిల్లాపెల్లి పవన్‌కళ్యాన్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మంద రాజుకు భార్య మృతి చెందగా 8ఏళ్లు పాప ఉంది.