Share News

కాకో ఆలయానికి తరలివస్తున్న గిరిజనులు

ABN , Publish Date - Oct 27 , 2024 | 10:30 PM

గుడిరేవులోని పద్మల్‌పూరీకాకో ఆలయానికి తరలివస్తున్నారు. దీపావళి పండుగతో దండారీ ఉత్సవాలు ముగుస్తుండటంతో ఆదివారం పెద్దఎత్తున గిరిజనులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. మందుగా గుస్సాడి వేషధారణలతో డప్పుచప్పులతో నృత్యాల మధ్య గోదావరి తారానికి చేరుకుని స్నానం ఆచరించి అమ్మవారిని గంగాజలంతో అభిషేకం చేసి దండారీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాకో ఆలయానికి తరలివస్తున్న గిరిజనులు

దండేపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గుడిరేవులోని పద్మల్‌పూరీకాకో ఆలయానికి తరలివస్తున్నారు. దీపావళి పండుగతో దండారీ ఉత్సవాలు ముగుస్తుండటంతో ఆదివారం పెద్దఎత్తున గిరిజనులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. మందుగా గుస్సాడి వేషధారణలతో డప్పుచప్పులతో నృత్యాల మధ్య గోదావరి తారానికి చేరుకుని స్నానం ఆచరించి అమ్మవారిని గంగాజలంతో అభిషేకం చేసి దండారీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలు ప్రత్యేక పిండి పదార్ధాలు వండి కాకోఅమ్మ వారికి సమర్పించారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో గిరిజనులు గుస్సాడి వేషధారణలు, గిరిజన కోలాటాలు, ఆటాపాటలతో సందడి చేశారు. దీంతో కాకో ఆలయ ప్రాంగణమంతా గిరిజనంతో సందడి నెలకొంది.

పద్మల్‌ పూరీ కాకో ఏత్మాసార్‌ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం గుస్సాడీ దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ కుడిమేత సోము, గోండ్వానా రాయిసెంటర్‌ మండల అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. ఆదివాసి సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా నిర్వహించే గుస్సాడీ దర్బార్‌కు మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దర్బార్‌ వేడుకలకు ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసి గిరిజనులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు, హాజరై విజయవంతం వారు కోరారు.

ముస్తాబైన ఆలయం

పద్మల్‌పూరీ కాకో గిరిజన దేవాలయంలో సోమవారం గుస్సాడీ దర్బార్‌ ఏర్పాటు సందర్భంగా కాకో ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి గిరిజనులు కుటుంబసభ్యులతో గుస్సాడీ దర్బార్‌కు హాజరుకానున్నారు. అందుకుగాను దేవాలయం వద్ద ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద సౌకర్యాలతోపాటు అన్నదానం ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Oct 27 , 2024 | 10:30 PM