అకాల వర్షం.. తీరని నష్టం...
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:50 PM
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు నష్టం కలిగించింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మండలంలోని పెద్దంపేట, గొల్లపల్లి, బుద్దిపల్లి గ్రామాల్లో వరి పంట నేలవాలింది.
హాజీపూర్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు నష్టం కలిగించింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మండలంలోని పెద్దంపేట, గొల్లపల్లి, బుద్దిపల్లి గ్రామాల్లో వరి పంట నేలవాలింది. మరో 15 రోజుల్లో పంట చేతికి వచ్చేవేళ అకాల వర్షం నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
భీమారం (ఆంధ్రజ్యోతి) : భీమారం మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో ఉన్న వరి పంట నేలవాలింది. ఇప్పటికే పొట్టదశలో ఉన్న వరి పంట వర్షానికి నేలవాలడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పోలంపల్లి పరిధిలోని మాంతమ్మ దేవాలయం సమీపంలో ఉన్న నక్క రాజన్న, పోటు భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డితోపాటు నక్క మల్లేష్‌ల వరి పంటలు నేలమట్టమయ్యాయి. పోలంపల్లిలో దాదాపు 50 ఎకరాల వరి పంట నేలమట్టమైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.