గిరిజనుల అభివృద్ధికి ఉత్కర్ష్ అభియాన్ పథకం
ABN , Publish Date - Nov 15 , 2024 | 10:44 PM
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి దిశగా ధర్తీ అబ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మోతిలాల్, నోడల్ అధికారి సీతారాం, డీఎంహెచ్‌వో హరీష్ రాజ్‌లతో కలిసి హాజరయ్యారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి దిశగా ధర్తీ అబ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మోతిలాల్, నోడల్ అధికారి సీతారాం, డీఎంహెచ్‌వో హరీష్ రాజ్‌లతో కలిసి హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ బీర్సా ముండా జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా గిరిజన నివాస ప్రాంతాల్లో గిరిజ నులకు నీళ్లు, ఆరోగ్యం, టెలికాం, విద్యుత్, గృహ నిర్మాణ వంటి కనీస సౌకర్యాల కల్పన అమలు చేస్తామన్నారు. బీర్సా ముండా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఏటీడీవో పురుషోత్తం, ఏసీఎంవో రాజమౌళి, గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.