వందే భారత్‌కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలి
ABN , Publish Date - Sep 12 , 2024 | 10:45 PM
సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ నెల 15న ప్రారంభమయ్యే వందేభారత్ రైలుకు మంచి ర్యాల రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్,మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతలు గురువారం హైద్రాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు వినతి పత్రం అందించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 12: సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ నెల 15న ప్రారంభమయ్యే వందేభారత్ రైలుకు మంచి ర్యాల రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్,మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతలు గురువారం హైద్రాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు వినతి పత్రం అందించారు. వందే భారత్ హాల్టింగ్ జాబితాలో జిల్లాలో ఒక్క రైల్వేస్టేషన్‌కు కూడా హాల్టింగ్ లేకపోవ డంతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి రోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారని తెలిపారు. మంచి ర్యాలలో రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.
పార్టీ సభ్యత్వానికి అనూహ్య స్పందన
మందమర్రిటౌన్, సెప్టెంబరు 12: బీజేపీ సభ్యత్వానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్, దుర్గం అశోక్‌లు తెలిపారు. గురువారం మందమర్రిలో వారు మాట్లాడుతూ పట్టణంలోని 42 బూత్‌లలో సభ్వత్యం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాల న్నారు. ప్రధాని మోదీతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. కుమార స్వామి, ఆరుముల్ల పోశం, అందుగుల శ్రీనివాస్, వేణు, అక్కల రమేష్, రవి, దీక్షితులు, రాజమల్లు, రాజేందర్, శివ, శ్రీనివాస్ పాల్గొన్నారు.