Share News

సమస్యల పరిష్కరించడానికే గ్రామాల్లో పర్యటన

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:11 PM

సమస్యలను పరి ష్కరించడానికే గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఎమ్మె ల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఇందారంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉం టున్నాయని సమస్యను పరిష్కరించాలని ఎమ్మె ల్యేకు తెలిపారు.

సమస్యల పరిష్కరించడానికే గ్రామాల్లో పర్యటన

జైపూర్‌, సెప్టెంబరు 29: సమస్యలను పరి ష్కరించడానికే గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఎమ్మె ల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఇందారంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉం టున్నాయని సమస్యను పరిష్కరించాలని ఎమ్మె ల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే విద్యుత్‌ శాఖ అధికా రులతో మాట్లాడి కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎల్లమ్మ గుడి నిర్మాణానికి కృషి చేస్తానని, రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేశానని తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇందారంలో మంచినీటి ఎద్దడి నివారణకు విశాఖ ట్రస్టు ద్వారా 20 బోర్‌వెల్‌లు వేశానని తెలిపారు. గ్రామాభివృద్ధికి త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఎస్సీ కాలనీ ప్రజలకు తాగునీటి ఎద్దడి నివారణకు ఒక బోర్‌వెల్‌ మంజూరు చేశానన్నారు. నాయకులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, ఫయాజ్‌, జక్కుల వెంకటేశం, గడ్డం ప్రసాద్‌గౌడ్‌, అరికె సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

వీరభద్రరావు సంతాప సభ

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 29: దివంగత కోనేరు వీరభద్రరావు ప్రజాహితమే లక్ష్యంగా పనిచే శారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. ఆదివారం ఎల్లందు క్లబ్‌లో వీరభద్ర రావు సంతాప సభలో మాట్లాడారు. మందమర్రిలో కాంట్రా క్టర్‌గా ప్రస్ధానాన్ని ప్రారం భించి అంచెలంచలుగా ఎదిగారన్నారు. ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి నివా ళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రసాద్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బోడ జనార్దన్‌, సొత్కు సంజీవరావు, బండి సదా నందంయాదవ్‌, రమేష్‌, రహ మాన్‌, జీఎంలు, సింగరేణి మాజీ డైరెక్టర్‌లు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నేతలు వీరభద్రరావు చి త్రపటం వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌, సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్‌, రంజిత్‌గౌడ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 10:11 PM