Share News

సమస్యలు పరిష్కరించాలని వీవోఏల ధర్నా

ABN , Publish Date - Nov 11 , 2024 | 10:41 PM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం 48 గంటల ధర్నా చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

సమస్యలు పరిష్కరించాలని వీవోఏల ధర్నా

నస్పూర్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం 48 గంటల ధర్నా చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ బకాయి ఉన్న స్ర్తీ నిధి ఇన్సెంటివ్‌ వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలన్నారు. గ్రామ సంఘం నుంచి రూ. మూడు వేల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. ప్రతీ నెల వేతనం సక్రమంగా రావడం లేదన్నారు.

గ్రామ సంఘానికి ట్యాబ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. వివోఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం రూ.20 వేల వేతనం, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజుల పాటు ఆందోళన చేపట్టమన్నారు. ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షకార్యదర్శులు కుంటాల కుమార్‌, దుర్గం రాములు, కోశాధికారి పోచం, నాయకులు లింగయ్య, సుజజాత, సరిత, లలిత, కిరణ్‌, కవిత, రాజ్యలక్ష్మి, పద్మ, సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:41 PM