ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేతను వ్యతిరేకిస్తున్నాం
ABN , Publish Date - Oct 08 , 2024 | 10:08 PM
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కమీషన్‌కు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అని, గడిచిన 8 నెలల్లో ఆయన ఎంత కమీషన్ తీసుకున్నాడో మా దగ్గర చిట్టా ఉందన్నారు.
మంచిర్యాల అర్బన్, అక్టోబరు 8: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కమీషన్‌కు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అని, గడిచిన 8 నెలల్లో ఆయన ఎంత కమీషన్ తీసుకున్నాడో మా దగ్గర చిట్టా ఉందన్నారు. ఎమ్మెల్యే కూల్చివేతలే పనిగా పెట్టుకున్నారని, ఐబీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ భవనాలను కూల్చివేశారని, ఆ కూల్చివేతల వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్నారు. మార్కెట్‌లోని వ్యాపార సముదాయాలను, ఆక్రమణల పేరుతో అర్థరాత్రి మార్కింగ్ చేసి కూల్చివేతలు చేపట్టారని, కూల్చివేతలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
శ్మశానవాటికను ఆనాడు గోదావరి తీరంలో కడతామని భూమిని కొనుగోలు చేస్తే వ్యతిరేకించిన ఎమ్మెల్యే ఇప్పుడు అదే ముంపు ప్రాంతమైన మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో భూధాన్ బోర్డు భూమిలో శ్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. అది కూడా సమ్మక్క-సారలమ్మల ఇల్లార్ల వద్దనే శ్మశానవాటికను నిర్మిస్తున్నారని, దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.