పవర్ ప్లాంటులో యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:45 PM
ప్రభావిత గ్రామాల యువతకు పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ, ఆయా గ్రామాల్లో రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
జైపూర్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభావిత గ్రామాల యువతకు పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ, ఆయా గ్రామాల్లో రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం చెన్నూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి నైపుణ్యాలు పెంచి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుందారంలో ఎమ్మెల్యేను అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపురావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజ్, సత్యనారాయణరెడ్డి, విశ్వంబర్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
చెన్నూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం వేకువజామున ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. కాలనీల్లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల శ్రీకాంత్ తండ్రి చనిపోగా అతని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.