ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం
ABN , Publish Date - Dec 12 , 2024 | 10:59 PM
నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర సంఘం సలహాదారు సంద అశోక్ తెలిపారు. గురువారం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఐటీఐ కార్యాలయంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర సంఘం సలహాదారు సంద అశోక్ తెలిపారు. గురువారం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఐటీఐ కార్యాలయంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ టీఎన్‌జీవో సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోం దని, ఇప్పటివరకు అనేక హక్కులను సాధించిందన్నారు.
జిల్లా కార్య దర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, జిల్లా ఉపా ధ్యక్షుడు కేజియా రాణి రామ్‌కుమార్, తిరుపతి, సంయుక్త కార్య దర్శులు సునిత, ప్రభు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.