Share News

నేతకానీలకు ప్రత్యేక కేటగిరి కేటాయించాలి

ABN , Publish Date - Oct 26 , 2024 | 11:32 PM

ఎస్సీ వర్గీకరణ చేస్తే నేతకానీలకు ప్రత్యేక కేటగిరి కేటాయించాలని నేతకాని మహర్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్‌, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాడి ముసలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఆర్‌టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు.

 నేతకానీలకు ప్రత్యేక కేటగిరి కేటాయించాలి

జన్నారం, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ చేస్తే నేతకానీలకు ప్రత్యేక కేటగిరి కేటాయించాలని నేతకాని మహర్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్‌, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాడి ముసలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఆర్‌టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. నేతకానీ కులం ఏ కులానికి ఉప కులం కాదని, నేతకానీల జనాభా 20 లక్షల వరకు ఉందని, జనాబా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

మాల సోదరులు మా జనాబాను వారి ఖాతాలో వేసుకొని ఎక్కువ రిజర్వేషన్‌ పొందుతున్నారన్నారు. ఏ కులానికి ఇవ్వాల్సిన రిజర్వేషన్‌ను ఆ కులానికే కేటాయించాలన్నారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్‌ నేత, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు అనపర్తి యువరాజ్‌, రాష్ట్ర ఉపాధ్యకులు తాళ్లపల్లి రాజేశ్వర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి గంగాధర్‌, మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్‌, జాడి వెంకట్‌, బోర్లకుంట ప్రభుదాస్‌, బండారి స్వామి, దుర్గం వినోద్‌, అల్లూరి వినోద్‌, మల్లయ్య, పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 11:32 PM