Share News

మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి

ABN , Publish Date - Oct 18 , 2024 | 10:35 PM

అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందన్నారు. మండల కేంద్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ కేంద్రం, పిండి వంటలు, పచ్చళ్ల తయారీ కేంద్రం, మెడికల్‌ స్టోర్‌ను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి

నెన్నెల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందన్నారు. మండల కేంద్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ కేంద్రం, పిండి వంటలు, పచ్చళ్ల తయారీ కేంద్రం, మెడికల్‌ స్టోర్‌ను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. రుణాలు పొంది క్రమశిక్షణతో వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించవచ్చన్నారు. సెర్ప్‌ ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని సాధికారత వైపు నడవాలన్నారు. బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగడతాయని సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం చిత్తాపూర్‌లో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డీఆర్‌డీఏ పీడీ కిషన్‌, టీజీబీ ఆర్‌ఎం మురళిమనోహర్‌ రావు, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఏపీఎం విజయలక్ష్మి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్‌, నాయకులు బొమ్మెన హరీష్‌గౌడ్‌, తోట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

బెల్లంపల్లిరూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. శుక్రవారం చాకపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రుణమాఫీ కానీ రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేపడుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 10:36 PM