Share News

చేతివృత్తులతో యువతకు ఉపాధి

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:41 PM

చేతి వృత్తులతో యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ చేతివృత్తుల డైరెక్టర్‌ దివ్యారావు అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణను పొందుతున్న మహిళలకు నస్పూర్‌ కాలనీలోని సేవా భవన్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

చేతివృత్తులతో యువతకు ఉపాధి

శ్రీరాంపూర్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి) : చేతి వృత్తులతో యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ చేతివృత్తుల డైరెక్టర్‌ దివ్యారావు అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణను పొందుతున్న మహిళలకు నస్పూర్‌ కాలనీలోని సేవా భవన్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

కేంద్ర జౌళిశాఖ అందించే కార్డులతో మహిళలు తయారు చేసిన వృత్తులను దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర జౌళిశాఖ డిజైనర్‌ రాజశ్‌, మందమర్రి ఏరియా డిప్యూటీ పర్సనల్‌ మేనేజర్‌ ఆసిఫ్‌, సీనియర్‌ పీవో కాంతారావు, సేవా కార్యదర్శి కొట్టె జ్యోతి, శ్రీరాంపూర్‌, మందమర్రి ఏరియాకు చెందిన శిక్షకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 10:41 PM