Adluri Laxman: బీఆర్ఎస్‌లో దళితులకు అన్యాయం
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:53 PM
నేడు యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ దళితుడిని తెలంగాణ మొదటి సీఎం చేస్తా అని మాట తప్పారని మండిపడ్డారు.
హైదరాబాద్: నేడు యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ దళితుడిని తెలంగాణ మొదటి సీఎం చేస్తా అని మాట తప్పారని మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్, తాటికొండ రాజయ్యలను ఎలా అవమానించారో ప్రజలు చూశారని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఎంతమంది దళితులకు భూములు,ఇండ్లు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. యాదాద్రిలో జరిగిన చిన్న సంఘటనకు సోషల్ మీడియాలో సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో దళితులు ఎందుకు లేరని నిలదీశారు. బీఆర్ఎస్‌కి ప్రజల్లోకి రావడానికి వీలు లేదు కాబట్టే ఈ అంశం తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ దళితుల వ్యతిరేక పార్టీ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకు మొదటి నుంచి అండగా ఉందని అడ్లురి లక్ష్మణ్ తెలిపారు.
బీఆర్ఎస్ విష ప్రయత్నం చేస్తుంది: బీర్ల ఐలయ్య
ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గొల్ల కురుమలు అండగా ఉండాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Birla Ilaiah) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... మరో రెండు రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అని విధాలుగా ఈ కార్పొరేషన్ గొల్ల కురుమలకు లబ్ధి చేకూరేలా ఉంటుందని స్పష్టం చేశారు. యాదాద్రిలో పూర్వం ఉన్న వసతులు సీఎం రేవంత్ కల్పిస్తున్నారన్నారు. గుట్టలో నిద్ర చేసే వెసులుబాటు.. కొబ్బరి కాయలు కొట్టే సంప్రదాయానికి ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్‌కి క్రెడిట్ దక్కుతుందని బీఆర్ఎస్ విష ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అగౌరవం అని ప్రచారం చేస్తున్నారని .. కానీ పరిస్థితుల వల్ల అక్కడ అనుకోకుండా కుర్చీ చిన్నగా ఉందని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి