Share News

Allu Arjun: ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. మరోసారి..

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:04 PM

Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. మూడు గంటలు పాటు విచారణ చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

Allu Arjun: ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. మరోసారి..
Allu-Arjun-Interrogation

Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై మూడు గంటలు పాటు విచారణ చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు పోలీసులు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు. పోలీసులు సేకరించిన వీడియోలు, సిసి ఫుటేజ్‌ను ముందు పెట్టి అల్లు అర్జున్‌ను విచారించారు.

ఇదిలాఉండగా.. అల్లు అర్జు్న్‌కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, విచారణ అనంతరం చిక్కడపల్లి పీఎస్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరారు అల్లు అర్జున్. ఎస్కార్ట్ వాహనంతో చిక్కడపల్లి పీఎస్ నుంచి తన ఇంటికి వెళ్లారు.

Updated Date - Dec 24 , 2024 | 03:10 PM