Allu Arjun: మరోసారి మీడియా ముందుకు అల్లు అర్జున్.. క్షమించండి అంటూ..
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:14 PM
జైలు నుంచి విడుదలైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి స్పందించారు. జైలు నుంచి విడుదలయ్యాక ఇంటికొచ్చిన బన్నీ.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆ రోజు జరిగిన ఘటన గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాధిత రేవతి కుటుంబానికి ఆయన క్షమాపణలు చెప్పారు. వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం బాధ పూడ్చలేనిదని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని తెలిపారు బన్నీ.
త్వరలో కలుస్తా
20 ఏళ్లుగా అదే థియేటర్‌కు వెళ్తున్నానని.. 30 సార్లు అక్కడ మూవీస్ చూశానన్నారు. కానీ ఎప్పుడూ ఇలాంటిది జరగలేదన్నారు. ట్రీట్‌మెంట్ పొందుతున్న రేవతి కుమారుడ్ని త్వరలో వెళ్లి పరామర్శిస్తానని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. దేశవ్యాప్తంగా తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు అల్లు అర్జున్. మీడియాతో పాటు అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసు గురించి ఇప్పుడు మాట్లాడలేనన్నారు బన్నీ.
Also Read:
అల్లు అర్జున్ ఇంటికి సురేఖ
అరెస్ట్ నుంచి రిలీజ్ వరకు.. టీ-షర్ట్‌తో అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్
ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు
For More Telangana And Telugu News