Share News

Amrapali: జీఐఎస్‏తో చెత్త సేకరణ పరిశీలన..

ABN , Publish Date - Aug 24 , 2024 | 09:08 AM

నగరంలో ప్రైవేట్‌ వాహనాల్లో రోజువారీ చెత్త సేకరణను జీఐఎస్(జియో గ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌) సిస్టమ్‌తో పరిశీలించాలని జోనల్‌ కమిషనర్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఆదేశించారు.

Amrapali: జీఐఎస్‏తో చెత్త సేకరణ పరిశీలన..

- టెలీ కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ ఆమ్రపాలి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో ప్రైవేట్‌ వాహనాల్లో రోజువారీ చెత్త సేకరణను జీఐఎస్(జియో గ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌) సిస్టమ్‌తో పరిశీలించాలని జోనల్‌ కమిషనర్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఆదేశించారు. నగరంలో సీజనల్‌ వ్యాధుల నివారణపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల సమన్వయంతో అధికారులు ముందుకు పోవాలన్నారు. శుక్రవారం అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల కేసుల రికార్డులు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రతివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిషనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

ఇదికూడా చదవండి: Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు


కేసుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతివారం సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. శానిటేషన్‌ నిర్వహణలో చెత్త వాహనాలు సకాలంలో చెత్త తీసుకుపోయే విధంగా పరిశీలించాలని, కార్మికుల హాజరు మూడు దశల్లో తీసుకుంటున్నందున ఎస్‌ఎఫ్ఏ సకాలంలో ఎఫ్‌ ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు తీసుకునే పాయింట్‌ను కార్మికులకు తెలియచేయాలన్నారు.


.......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

Hyderabad: రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే..

- హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో..

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ రన్నర్స్‌ మారథాన్‌ రన్‌ సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌(Hyderabad, Cyberabad) కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు. మారథాన్‌ 10 కి.మీ, ఫుల్‌ మారథాన్‌ 21 కిలోమీటర్ల మేర నిర్వహిస్తారు. మారథాన్‌ నెక్లె్‌స్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా(People's Plaza) నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌, సంజీవయ్యపార్క్‌, పీపుల్స్‌ప్లాజా, ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ రోడ్‌, సోమాజిగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్‌(Somajiguda, Panjagutta Flyover), ఎంజే కాలేజ్‌, ఎస్‌ఎన్‌టీ జంక్షన్‌, సాగర్‌ సొసైటీ, కేబీఆర్‌ పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌(Jubilee Hills Checkpost), రోడ్‌నంబర్‌ 45, కేబుల్‌ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్‌, నాలెడ్జ్‌ సిటీ, మైహోం అబ్రార్‌, ఐకియా, బయోడైవర్సిటీ, టెలికాంనగర్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, ఇందిరానగర్‌, ఐఐఐటీ జంక్షన్‌ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు.

city1.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2024 | 09:08 AM