Home » Amrapali Kata
క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ (తెలంగాణ), సి.హరికిరణ్, లోతేటి శివశంకర్, జి.సృజన(ఏపీ) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) నిరాకరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఏపీకి వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది.
క్యాడర్ వివాదంలో ఉన్న ఏడుగురు ఐఏఎ్‌సలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఇక్కడే కొనసాగుతారా? లేదా? అన్న చర్చ అధికార, ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. 2010 ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలి తెలంగాణ నివాసంగా పరిగణించి ఇక్కడి కేడర్‌గా గుర్తించాలని కోరగా, ఖండేకర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆమె విజ్ఞప్తిని తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
ఏపీ కేడర్ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్ ఇచ్చింది.
నగరంలో రోడ్ల పక్కన చెత్త కుప్పలు లేకుండా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణను పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులకు సూచించారు.
జీహెచ్‌ఎంసీ(GHMC)లో ప్రజావాణి గాడి తప్పుతోంది. సమయానికి అధికారులు రాక.. ఫిర్యాదులు పరిష్కారం కాక పౌరులు మండిపడుతున్నారు. సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఒకరిద్దరు మినహా ఉన్నతాధికారులు అందుబాటులో లేరు.
మహానగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ రఘుప్రసాద్‌ను ఆదేశించారు. జోనల్, అదనపు కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహానగరం చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.
వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.