Share News

Hyderabad: ఒకే ఒక్కడు.. 60వేల శవపరీక్షల్లో సాయం!

ABN , Publish Date - Jun 29 , 2024 | 05:02 AM

ఆస్పత్రి మార్చురీ పరిసరాల పేరు చేబితేనే వామ్మో అంటాం. మృతదేహాలు, సంబంధిత బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి ఒళ్లు జలదరింపజేస్తుంది.

Hyderabad: ఒకే ఒక్కడు.. 60వేల శవపరీక్షల్లో సాయం!

  • గాంధీ ఆస్పత్రి మార్చురీ టెక్నీషియన్‌ సలీం రికార్డు

  • 42 ఏళ్ల సర్వీసు.. ఘనంగా వీడ్కోలు పలికిన వైద్యులు

అడ్డగుట్ట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి మార్చురీ పరిసరాల పేరు చేబితేనే వామ్మో అంటాం. మృతదేహాలు, సంబంధిత బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి ఒళ్లు జలదరింపజేస్తుంది. మరి.. నిత్యం మార్చురీలో పనిచేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! ఏడాది.. రెండేళ్లు కాదు.. ‘మార్చురీ టెక్నీషియన్‌’గా గాంధీ ఆస్పత్రిలో 42 ఏళ్ల సర్వీసులో 60వేలకు పైగా శవపరీక్షల్లో వైద్యులకు సాయం చేశారు సలీం అనే ఉద్యోగి! ఇది ఓ రికార్డు అని చెబుతున్నారు. సలీం శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు.


గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెషర్‌ రాజారావు ఆధ్వర్యంలో గాంధీ మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌ విభాగంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో సలీంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మార్చురి విభాగాధిపతి కృపాల్‌ సింగ్‌, ఫోరెన్సిక్‌ వైద్యులు, గాంధీ పూర్వ వైద్య విద్యార్ధులు, పీజీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు

Updated Date - Jun 29 , 2024 | 05:02 AM