Andhra Jyoti-ABN: 7న ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 04 , 2024 | 12:45 PM
ప్రతి యేటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్(Andhra Jyoti-ABN) నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గులు.. పవర్డ్ బై ఎయిమ్స్ విద్యాసంస్థలు, బెంగళూరు..
- మహిళలందరికీ ఆహ్వానం
సనత్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ప్రతి యేటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్(Andhra Jyoti-ABN) నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గులు.. పవర్డ్ బై ఎయిమ్స్ విద్యాసంస్థలు, బెంగళూరు.. రియల్ పార్టనర్ స్వర్గసీమ సుకేతన’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలు ఈ నెల 7న సనత్‌నగర్ జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల మహిళలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి రూ.4 వేలు, తృతీయ బహుమతికి రూ.3 వేలు ప్రదానం చేయనున్నారు. ఈ పోటీలో చుక్కల ముగ్గులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ముగ్గుల రంగులు మహిళలు వెంట తెచ్చుకోవాలి. ఈ పోటీలకు ఆసక్తి గల వారు 9848320091, 9866305718లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు.