Live Updates: కేటీఆర్‌కు లీగల్ నోటీసులు
ABN , First Publish Date - Sep 26 , 2024 | 07:44 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-26T18:53:39+05:30
కేటీఆర్‌కు లీగల్ నోటీసులు
హైదరాబాద్: అమృత్ టెండర్ల ఆరోపణలపై కేటీఆర్‌కు నోటీసులు
కేటీఆర్‌కు లీగర్ నోటీసలు పంపిన సృజన్‌రెడ్డి
తప్పుడు ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందంటూ..
కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపిన సృజన్‌రెడ్డి
-
2024-09-26T16:49:19+05:30
జగన్ తిరుమల వస్తే ఆలయం అపవిత్రం అవుతుంది
ప్రకాశం: ఐదేళ్ళపాటు సీఎంగా పని చేసిన జగన్ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు.
ఇంతటి పరాభవం ఎదురవుతుందని జగన్ ఊహించి ఉండరు.
మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ నానా గడ్డి కరుస్తున్నాడు.
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సాక్ష్యాలు ఉన్నాయి.
రాజకీయానికి వాడుకోవాలని జగన్ చూస్తున్నాడు.
ఏ విచారణ కైనా సిద్దమని జగన్ అంటున్నాడు.
ఏ విచారణ జరపొద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.
జగన్ తిరుమల వెళ్తే ఆలయం అపవిత్రం అవుతుంది.
జగన్ హిందువా, క్రిస్టియనా అనే చర్చ జరుగుతుంది.
జగన్ క్రైస్తవుడని ఆయన తల్లి, భార్య చెబుతున్నారు: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
-
2024-09-26T15:45:56+05:30
అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అపవిత్రం
పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో భారీ లడ్డూ కుంభకోణం
లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది
లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు
అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ముందుకొచ్చారు
తిరుమల లడ్డూ ప్రసాదంతోపాటు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు
వైసీపీ ట్రస్ట్ బోర్డు రైతు డైరి వద్ద నెయ్యి కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు
-
2024-09-26T15:31:01+05:30
జగన్ తిరుమల పర్యటనలో కుట్ర
గుంటూరు జిల్లా: ఈనెల 28వ తేదీన తిరుమలకు వైసీపీ అధినేత జగన్
జగన్ పర్యటనలో కుట్ర ఉంది: సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ
హిందూ ధర్మ విశ్వాసాలను రెచ్చగొట్టేందుకే తిరుమల వస్తున్నారు.
జగన్‌కు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే భార్య భారతితో కాలినడకన వచ్చి గుండు చేయించుకోవాలి,
తిరుమల డిక్లరేషన్‌లో జగన్ సంతకం పెడితే దర్శనానికి అనుమతి ఇవ్వాలి.
లేదంటే అలిపిరి వద్ద అడ్డుకుని తీరుతాం: సనాతన ధర్మ పరిరక్షణ జేఏసి నేతలు
-
2024-09-26T13:35:22+05:30
మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ
శ్రీకాకుళంలో గల సొరండాల వీధిలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన లోకేశ్
-
2024-09-26T12:28:47+05:30
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ బ్యూరో చీఫ్ నారాయణ మృతి
నారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
నారాయణ ఆకస్మిక మరణం బాధాకరం
నారాయణ కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
-
2024-09-26T11:45:55+05:30
చైనా ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్‌పై ఈడీ చర్యలు
ఆన్లైన్ గేమింగ్ యాప్ FIEWINతో చైనాకు చెందిన వ్యక్తుల క్రిప్టో ఖాతాలను స్తంభింపజేసిన ఈడీ.
రూ.25 కోట్ల విలువైన క్రిప్టో ఖాతాలు సీజ్
భారత్ నుంచి గేమింగ్ యాప్ ద్వారా రూ.400 కోట్లు చైనాకు చేరాయి: ఈడీ
కేసుతో సంబంధం ఉన్న నలుగురు భారతీయల అరెస్ట్
భారత్ నుంచి రూ.400 కోట్ల డబ్బు చైనాకు చేరింది.
గేమింగ్ యాప్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా కుట్ర
చైనాకు చెందిన ముగ్గురి క్రిప్టో ఖాతాలు స్వాధీనం
-
2024-09-26T10:32:22+05:30
వినూత్న నిరసన
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో జన జాగరణ సమితి నిరసన
దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు
విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి
నగరంలో చాలా చోట్ల దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో పోస్టర్లు
-
2024-09-26T09:51:20+05:30
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.
తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వారు మళ్ళీ అక్కడికి వెళ్లొద్దు
తిరుమల వెళితే హిందువులు ఏకమై వారిని చంపేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
ఆలయాలు, దేవదాయ ధర్మాదాయ శాఖ భూములను కాపాడాలి.
తిరుపతి, శ్రీశైలంలో అన్య మతస్తులు మత మార్పిడి చేసే అవకాశం ఉంది.
-
2024-09-26T09:08:58+05:30
దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు!
తనిఖీల్లో షాకింగ్ విషయాలు
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వాడే జీడిపప్పు ప్యాకెట్లపై కనిపించని లేబుల్స్
దుర్గమ్మ లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల అనుమానాలు
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
నాసిరకం సరుకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు
జీడిపప్పు, ఇతర ప్యాకెట్లపై కనిపించని లేబుల్స్
నాణ్యత లేదని 1,100 కిలోల కిస్మిస్, 700 కేజీల జీడిపప్పును తిరస్కరించిన అధికారులు
జీడిపప్పు, కిస్మిస్ నాణ్యతకు తిలోధకాలు
-
2024-09-26T08:41:35+05:30
నేడు జనసేనలోకి కీలక వైసీపీ నేతలు
ఇవాళ జనసేనలో చేరనున్న పలువురు వైసీపీ నాయకులు
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య
ఈ ముగ్గురితో పాటు వందల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులతో జనసేనలో చేరనున్నట్లు ప్రకటన
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న నేతలు
జగన్ ఒంటెద్దు పోకడలతో విసిగిపోయి రాజీనామా
-
2024-09-26T08:18:21+05:30
ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు
13 రోజులు పాటు తిరిగే విధంగా ప్రత్యేక బస్సు సర్వీసులు
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో 964 బస్సులు
హైదరాబాద్ విజయవాడ మధ్య అత్యధికంగా 353 బస్సులు
రాజమండ్రికి 241, విశాఖపట్నంకు 90, బెంగళూరుకు 14 బస్సు
చెన్నైకి 22, ఇతర ప్రాంతాలకు 244 ప్రత్యేక బస్సులు సిద్ధం
-
2024-09-26T07:58:40+05:30
గాంధీ ఆసుపత్రిలో ఒక రోజు శిశువు కిడ్నాప్ కలకలం.
నిన్న పుట్టిన పాపను తీసుకొని వెళ్ళిన దగ్గరి బంధువులు
పెంచుకోవడానికి పసిగుడ్డును ఇచ్చినట్టు అనుమానాలు
తల్లికి విషయం తెలియడంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు
తల్లి ఫిర్యాదుతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
సురక్షితంగా పాపను తీసుకొచ్చిన పోలీసులు
-
2024-09-26T07:48:32+05:30
నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ
చర్ల మండలం పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై నిన్న రాత్రి మావోయిస్టుల మెరుపు దాడి
అరగంట పాటు మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు
ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన చేయని పోలీస్ అధికారులు, మావోయిస్టులు
ఛత్తీస్గడ్ ధర్మారం క్యాంప్‌నకు 2 కిలో మీటర్ల దూరంలోనే పూసుగుప్ప క్యాంప్
సెప్టెంబర్ 5న కరకగూడెం ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతం
మావోయిస్టులు తెలంగాణలో అడుగు పెట్టకుండా తెలంగాణ పోలీస్ హెచ్చరిక
ఆపరేషన్ కగార్‌లో భాగంగా కొనసాగుతున్న భారీ కూంబింగ్
ఉలిక్కిపడ్డ తెలంగాణ పోలీస్
పూసుగుప్ప క్యాంప్‌పై దాడితో నిఘా వర్గాల ఆరా
హై అలర్ట్ జోన్‌గా మారిన చర్ల మండలం
భారీగా సాగుతున్న కూంబింగ్