Share News

Harsha Sai: హర్షసాయి కేసులో మరో ట్విస్ట్.. మరో ఫిర్యాదు అందుకున్న పోలీసులు

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:11 PM

యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ యూట్యూబర్(YouTuber) హర్ష సాయి (Harsha Sai) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Harsha Sai: హర్షసాయి కేసులో మరో ట్విస్ట్.. మరో ఫిర్యాదు అందుకున్న పోలీసులు

హైదరాబాద్: యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ యూట్యూబర్(YouTuber) హర్ష సాయి (Harsha Sai) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్షసాయిపై బాధితురాలు గురువారం మరో ఫిర్యాదు చేశారు.

హర్ష తనకు కొన్ని గంటలుగా ఈ మెయిళ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఇదే పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టిన సంగతి తెలిసిందే.


దర్యాప్తు ముమ్మరం..

హర్షపై లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. మరోవైపు ‘మెగా’ సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగికంగా వేధించారని బాధితరాలు తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు. హర్షసాయిపై మంగళవారం కేసు నమోదు అయ్యింది.


తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 03:16 PM