Share News

Begumpet Airport: ‘బేగంపేట’లో అపోలో విమానానికి ‘డ్యామేజీ’

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:24 AM

బేగంపేట విమానాశ్రమంలో నిలిపి ఉంచిన అపోలో ఆస్పత్రుల యాజమాన్యానికి చెందిన విమానం ఇంజన్‌ పరికరాలకు గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా నష్టం కలిగించారు.

Begumpet Airport: ‘బేగంపేట’లో అపోలో విమానానికి ‘డ్యామేజీ’

  • స్పందించని విమానాశ్రయ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు

బేగంపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): బేగంపేట విమానాశ్రమంలో నిలిపి ఉంచిన అపోలో ఆస్పత్రుల యాజమాన్యానికి చెందిన విమానం ఇంజన్‌ పరికరాలకు గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా నష్టం కలిగించారు. దీనిపై విమానాశ్రయ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అపోలో ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపోలోకు చెందిన వీటీ-పీసీఆర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను బేగంపేట విమానాశ్రయంలో పార్క్‌ చేస్తుంటారు.


ఈ క్రమంలో సదరు విమానం ఈ ఏడాది ఏప్రిల్‌ 5కు ముందు రెండు వారాల పాటు అక్కడే ఉంది. అయితే, ఏప్రిల్‌ 5న చెన్నై వెళ్లేందుకు విమానాన్ని పరిశీలించగా ఇంజన్‌లోని కొన్ని పరికరాలు స్వల్పంగా దెబ్బతిని ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు అపోలో ఆస్పత్రుల చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ జగ్జీత్‌సింగ్‌ బేగంపేట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 26 , 2024 | 04:24 AM