Kondagattu: కొండగట్టు జాతరకు ప్రత్యేక అధికారుల నియామకం
ABN , Publish Date - May 30 , 2024 | 05:26 AM
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
హనుమాన్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ సమీక్ష
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర పనుల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు రామకృష్ణ, వినోద్ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు.