Share News

Siddipet: స్వగ్రామంలో అందెశ్రీ..

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:45 AM

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జయజయహే గీతాన్ని నేడు జాతికి అంకితమివ్వనుండటంతో ఈ చరిత్రాత్మక ఘట్టానికి ముందు గేయ రచయిత అందెశ్రీ తన స్వగ్రామాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని శనివారం సందర్శించిన ఆయన..

Siddipet: స్వగ్రామంలో అందెశ్రీ..

మద్దూరు, జూన్‌ 1: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జయజయహే గీతాన్ని నేడు జాతికి అంకితమివ్వనుండటంతో ఈ చరిత్రాత్మక ఘట్టానికి ముందు గేయ రచయిత అందెశ్రీ తన స్వగ్రామాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని శనివారం సందర్శించిన ఆయన... చిన్ననాటి స్నేహితులతో పాటు గ్రామస్థులతో సంతోషాన్ని పంచుకున్నారు. దూళిమిట్ట మండలంలోని బెక్కంటి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కాగా, ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించడంతో అందెశ్రీ స్వగ్రామమైన రేబర్తిలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఘట్టం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 04:45 AM