Share News

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:30 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలపై కాంగ్రె స్‌ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలపై కాంగ్రె స్‌ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. దీన్‌దయాల్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఉచితంగా చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను కేంద్రమంత్రి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న పది సంవత్సరాలు సూపర్‌ పవర్‌గా సోనియాగాంధీ కొనసాగుతూ ఆయనను రబ్బర్‌ స్టాంపుగా మార్చారని ఆరోపించారు.


మన్మోహన్‌ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలను నిర్వహించి, ఢిల్లీలోనే స్మారక స్థల్‌ నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మాజీ ప్రధానిగా పీవీ నర్సింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన కాంగ్రె్‌సకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వానికి సంజయ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక అన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 03:30 AM