Share News

Bandi Sanjay: అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిన కాంగ్రెస్‌:సంజయ్‌

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:39 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును చూస్తుంటే... అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిపోయేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిన కాంగ్రెస్‌:సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును చూస్తుంటే... అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిపోయేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ‘‘ఏడాదిలోనే రూ.1.27లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే...మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని కలిపి రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకునే పరిస్థితి కళ్లముందే కన్పిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ ఊహించనంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


రెండు పార్టీలను గెలిపించి అధికారం కట్టబెట్టిన పాపానికి రూ.8లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారని గురువారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ఆవిర్భావానికి ముందు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఈ రెండు పార్టీల స్వార్థ ప్రయోజనాలు, దివాలాకోరు విధానాల వల్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 20 , 2024 | 03:39 AM