Share News

TS Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన

ABN , Publish Date - Aug 30 , 2024 | 02:51 PM

బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవబోతోందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి కారు పార్టీ సహకరించిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను కలుపుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

TS Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన

హైదరాబాద్: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవబోతోందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి కారు పార్టీ సహకరించిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను కలుపుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను కలుపుకుంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితకు టికెట్లు ఇవ్వాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా ఎన్నికల్లో టికెట్ కావాలంటాడని సెటైర్ వేశారు. అందరకీ టిక్కెట్లు ఇవ్వడానికి బీజేపీ కుటుంబ పార్టీ కాదని విమర్శించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది. త్వరలో కలసిపోతాయి’’ అని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.


బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదని కేంద్ర మంత్రి అన్నారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని, కవిత బెయిల్ కోసం వాదించినందుకే అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకు పంపారని మరోసారి ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే సింఘ్వీకి రాజ్యసభ సీటు కేటాయించాయని అన్నారు. 38 మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు‌ పోటీ చేయలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచి.. గడీలు బద్దలు కొట్టింది బీజేపీ మాత్రమేనని అన్నారు.


కేసీఆర్‌ను దెబ్బకొట్టడానికే బీజేపీ - కాంగ్రెస్ కలయిక: బీఆర్ఎస్ నేత

బీజేపీ-కాంగ్రెస్ పార్టీల కలయిక కేసీఆర్‌ను దెబ్బకొట్టడానికేనని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీతో కాంగ్రెస్‌కి దోస్తీ ఉండదని ఆరోపించారు. ‘‘కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల అంశంలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. తెలంగాణకు కాకుండా పక్క రాష్ట్రానికి కేంద్రం నిధులు కట్టబెట్టింది. మన రాష్టానికి నిధులు రాకపోవడం కాంగ్రెస్ వైఫల్యం. తెలంగాణ మీడియా సంస్థలు తెలంగాణకి రుణపడి ఉండాలి. మన రాష్ట్రానికి అన్యాయం జరిగితే మీడియా సంస్థలు ప్రశ్నించాలి. రూ.2,500 కోట్ల కన్సాలిడేట్ ఫండ్ నిధులు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లాయి. మన రాష్ట పెద్దలకు తెలియకుండానే పక్క రాష్ట్రా నికి నిధులు వెళ్లాయా?. హైడ్రా కూల్చివేతలు కేవలం గ్లాడియేటర్ మూవీ స్క్రిప్ట్. హైడ్రాతో రాష్ట్రంలో ఒరిగేది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధ్వంద్వ వైఖరి’’ అని ఆయన మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఓవైసీ వార్నింగ్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది

ప్రైవేట్ సెక్యూరిటీ వేతనంపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

For more TS News and Telugu News

Updated Date - Aug 30 , 2024 | 03:01 PM