BJP: రాముడి పేరుతో బరాబర్ ఓట్లు అడుగుతాం.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Mar 12 , 2024 | 04:44 PM
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతో బరాబర్ తాము ఓట్లను అడుగుతామని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ పేరు చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతో బరాబర్ తాము ఓట్లను అడుగుతామని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ పేరు చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. అయోధ్య రాముడు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే దేవుడు అని చెప్పారు. రాముడు వారసుడు నరేంద్ర మోదీనే అని తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ అని... కాంగ్రెస్ (Congress) ప్రధాని అభ్యర్థి ఎవరు? అని నిలదీశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. 20రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చుక్కలు చూపిస్తారని అన్నారు. బీజేపీకి ఇవ్వాల్సిన అధికారాన్ని.. కాంగ్రెస్‌కు ఇచ్చామని ప్రజలు బాధ పడుతున్నారని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాడర్‌కు బీజేపీ వ్యతిరేకం కాదని.. ఆపార్టీ నేతలకు మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని అన్నారు. అందరికీ రూ.500కే గ్యాస్‌తో పాటు.. ప్రతి మహిళకు రూ. 2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నియోజవర్గానికి వంద ఇళ్లను కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నమ్మరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయటానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు లేరని అన్నారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. రెండు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని తీసుకువస్తుందని తెలిపారు. అయోధ్య రాముడు కోసం బలిదానాలు చేసింది బీజేపీ కార్యకర్తలు మాత్రమేనని చెప్పారు. అయోధ్య కోసం చావడానికి సిద్ధపడింది బీజేపీ కార్యకర్తలు మాత్రమేనని వివరించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎందుకు బలిదానాలు చేయలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
TS Politics: యాదగిరిగుట్టలో కింద కూర్చోవడానికి కారణమిదే: భట్టి విక్రమార్క
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి