Share News

Bandi Sanjay: ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది

ABN , Publish Date - Sep 22 , 2024 | 05:17 PM

ఓవైసీ బ్రదర్స్‌కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.

Bandi Sanjay:  ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది

హైదరాబాద్: ఓవైసీ బ్రదర్స్‌కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా కరీంనగర్‌లో సంజయ్ ఆదివారం మాట్లాడారు. ఎంఐఎం పార్టీ మీటింగ్‌లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు ఇస్లామోఫోబియా పట్టుకుందని, అందుకే మదర్సాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ వ్యాఖ్యలకు బండి కౌంటర్ ఇచ్చారు.

ఆయనది హిందూ ఫోబియా..

తనకు ఇస్లామోఫోబియా లేదనీ, ఓవైసీ మాత్రం హిందూ ఫోబియాతో ఇబ్బంది పడుతున్నాడని సంజయ్ విమర్శించారు. పోలీసులను తీసేసి తనకు 15 నిమిషాలు టైమిస్తే, దేశంలోని హిందువులందరినీ నరికి చంపేస్తానని అన్న వ్యక్తికి హిందూఫోబియా ఉన్నట్లేగా? అని అన్నారు. ఓవైసీ సోదరులు, ఎంఐఎం నేతలు, కార్యకర్తలు ఎన్నడూ వందేమాతర గేయాన్ని ఆలపించలేదని, ఏ ఫోబియా వాళ్లను ఆపుతుందో చెప్పాలన్నారు. హిందువులు లౌకిక విలువలను పాటిస్తూ పీర్ల పండగ జరుపుకుంటారని.. ఏనాడైనా ఓవైసీ హిందువుల పండగల్లో పాల్గొన్నారా? బొట్టు పెట్టుకుని హిందూ దేవతలకు నమస్కరించారా? అని ప్రశ్నించారు.


ఉగ్రవాద ఫ్యాక్టరీలవి..

తానెప్పుడు మదర్సాల గురించి మాట్లాడినా ఓవైసీ తెగ బాధపడిపోతారని, ఉగ్రవాదులతో సంబంధమున్న ఓ టెర్రరిస్టు ఓవైసీ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ దొరికింది నిజం కాదా అని బండి ప్రశ్నించారు. "ఉత్తరప్రదేశ్‌‌లోని బిజ్‌నోర్‌ మదర్సాలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర మారణాయుధాలు దొరికాయి. అలాంటప్పుడు మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేస్తున్నాయని అంటే ఓవైసీకి వచ్చిన బాధేంటి.

దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడ్డా వారిలో కచ్చితంగా ఒక్కరికైనా పాత బస్తీతో సంబంధాలు ఉంటున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు ఎంఐఎం నేతలు ఆధార్, రేషన్ కార్డులిప్పించి ఆశ్రయం కల్పి్స్తున్న మాట నిజం కాదా?. ప్రస్తుతం పాత బస్తీలోని కొన్ని ముస్లిం వర్గాలు ఓవైసీ కుటుంబ నియంతృత్వ ధోరణితో విసిగిపోయాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీని, న్యూ సిటీగా మార్చుతాం. ఓవైసీ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని బండి వ్యాఖ్యానించారు.


హైడ్రాపై..

భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రాకు తాను వ్యతిరేకం కాదని బండి స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కూల్చివేతల విషయంలో రాజకీయ ప్రలోభాలు ఉండకూడదని.. అక్రమ నిర్మాణాలు ఏ పార్టీవారివైనా కూల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఓటుకు నోటుకు కేసు విచారణ జరపలేదని, దీనిని బట్టి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంద‌ని బండి ఆరోపించారు.

Updated Date - Sep 22 , 2024 | 06:04 PM